
రచయిత మరియు దర్శకుడు కొరటాల శివ మిర్చి విజయం తరువాత మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించే పనిలో వున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి బాలీవుడ్ కొరియోగ్రాఫర్లైన బాస్కో – సీజర్ లు పనిచేయనున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో మహేష్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. జగపతిబాబు మహేష్ తండ్రిపాత్రలో మెరవనున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

