ఆ రెండు చిత్రాలకు బాలీవుడ్ భయపడుతుందా…!

Published on Aug 17, 2019 12:10 pm IST

టాలీవుడ్ తీరుతెన్నులు మారిపోయాయి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ దేశంలోనే అన్ని చిత్ర పరిశ్రమలకు సవాలు విసురుతుంది. భారీ చిత్రాల నిర్మాణంతో పాటు, వినూత్న మైన చిత్రాలు నిర్మిస్తూ మిగతా పరిశ్రమలకు బెంచ్ మార్క్ సెట్ చేశే స్థితికి చేరింది. గతకాలంలో సౌత్ నుండి ఒక్క తమిళ చిత్రాలకు మినహా మిగతా పరిశ్రమల చిత్రాలకు బాలీవుడ్ లో అంత ఆదరణ ఉండేది కాదు. కాని నేడు పరిస్థితులు మారాయి, దేశంలోని అన్ని పరిశ్రములు తెలుగు సినిమా వైపు చూస్తున్నాయి.

ఇక రానున్న రెండు నెలలో టాలీవుడ్ రెండు భారీ చిత్రాలను విడుదల చేయనుంది. అందులో ఒకటి ప్రభాస్ సాహో కాగా,మరొకటి చిరంజీవి నటిస్తున్న సైరా. ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషలలో విడుదల కానున్నాయి. సాహో మూవీపై భారీ అంచనాలున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని 300కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ నటిస్తుండగా, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ,మహేష్ మంజ్రేకర్, మురళి శర్మ,వెన్నెల కిషోర్, లాల్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కింది.

ఈనెల 30న విడుదల అవుతున్న సాహో మూవీ 330కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ మూవీ కనుక విజయం సాధిస్తే 500కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం. ఈ మూవీకి వస్తున్న బజ్ దృష్ట్యా ఇదేమంత కష్టం కాదనే మాట వినిపిస్తుంది.

ఇక రాయలసీమ మొదటితం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా కూడా 200కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగు,హిందీతో పాటు పలు భాషలలో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అమితాబ్,నయనతార,జగపతిబాబు,విజయ్ సేతుపతి,సుదీప్, తమన్నా వంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈచిత్రాన్ని దర్శకుడు సురేంధర్ రెడ్డి తెరకెక్కించారు. ఈ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం 300 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది.

ఈ రెండు చిత్రాలు కనుక బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే బాలీవుడ్ ఆధిపత్యానికి గండిపడటం ఖాయం. ఎందుకంటే ఈ మధ్య బాలీవుడ్ లో బడా చిత్రాల నిర్మాణం అంతగా జరగడం లేదు. అమీర్, అమితాబ్ కాంబినేషన్ లో వచ్చిన హై బడ్జెట్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ భారీ పరాజయం చవిచూసింది. కరణ్ జోహార్ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర పేరుతో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలితో బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన టాలీవుడ్ ,ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తే ఆ ప్రభంజనం కొనసాగించినట్లవుతుంది. అందుకే బాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకనిర్మాతలు ఈ చిత్ర ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :

X