“ఎన్టీఆర్30” కోసం బాలీవుడ్ బ్యూటీ!?

Published on May 22, 2022 4:00 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో మాస్ అండ్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సిద్దం అవుతున్నారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ మరోసారి ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ కి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ మరియు యువ సుధ ఆర్ట్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ హీరోయిన్ ను ఫైనల్ చేసేందుకు పలు బాలీవుడ్ హీరోయిన్ లని పరిగణన లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీ కపూర్ ను తీసుకొనే అవకాశం ఉంది. అయితే విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్న లైగర్ భామ అనన్య పాండే కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఎవరిని ఫైనల్ చేస్తారనే దానిపై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సారి పాన్ ఇండియా మూవీ గా వస్తుండటం తో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :