ప్రభాస్ సినిమాకు ఆ బాలీవుడ్ హీరోయిన్.?

Published on May 22, 2020 6:32 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్ మరియు పూజా హెగ్డేలు హీరో హీరోయిన్లుగా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ స్వచ్ఛమైన వింటేజ్ ప్రేమ కావ్యం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.భారీ పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ చేతిలో ఉండగానే ప్రభాస్ యువ దర్శకుడు నాగశ్విన్ తో మరో భారీ ప్రాజెక్ట్ ఒకే చేసి మరింత ఆశ్చర్యపరిచారు.

అయితే ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు హీరోయిన్ వేటలో పడ్డట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కూడా ఎలాగో పాన్ ఇండియన్ సినిమాగానే తెరకెక్కిస్తున్నారు కాబట్టి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వినికిడి. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆలియా ప్రస్తుతం దర్శక ధీరుడు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు నటిస్తున్న “రౌద్రం రణం రుధిరం” చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More