రానాకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ !
Published on Jun 5, 2018 8:27 am IST

రానా దగ్గుబాటి చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘హాతి మేరే సాతి’ కూడ ఒకటి. తెలుగులో ‘అరణ్య’ పేరుతో ఈ చిత్రం విడుదలకానుంది. ఏనుగులు, మనుషులు మధ్య ఉండే స్నేహ బంధం అనే అంశం ఆధారంగా రూపొందుతున్న ఏ చిత్రంలో రానాకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ నటించనుంది.

ఈ చిత్రంలో ఆమె తమిళనాడుకు చెందిన యువతిగా కనిపిస్తుందని, ఆమె పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని, ఆమె ఈ సినిమాలో పనిచేయడం ఎగ్జైటింగా ఉందని చిత్ర దర్శకుడు ప్రభు సాలమన్ అన్నారు. ఇప్పటికే కొంత షూట్ ముగించుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఆగష్టు నుండి మొదలుకానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలలో రూపొందనున్న ఈ చిత్రంలో పుల్కిత్ సామ్రాట్, హుస్సేన్, జోయా వంటి నటీనటులు నటిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook