హిందీలో కూడా దమ్ము చూపిన సందీప్ వంగ

Published on Jun 22, 2019 2:00 am IST

‘అర్జున్ రెడ్డి’తో తెలుగునాట సంచలనం రేపిన దర్శకుడు సందీప్ వంగ ఆ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతొ రీమేక్ చేశారు. తెలుగు వెర్షన్ సాధించిన సక్సెస్ నేపథ్యంలో హిందీ వెర్షన్ మీద కూడా అంచనాలు పెరిగాయి. ట్రైలర్ బాగుండటంతో అవి కాస్త తారా స్థాయికి చేరుకున్నాయి. హిందీ సినీ పెద్దలంతా తెలుగు దర్శకుడు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలని ఎదురుచూశారు.

సినిమాకున్న హైప్ మూలాన ఇండియాలో సుమారు 3000 థియేటర్లలో చిత్రం విడుదలైంది. అన్ని సెంటర్లలోనూ మంచి ఆక్యుపెన్సీ దొరికింది. ట్రేడ్ వర్గాలు షాహిద్ కపూర్ కెరీర్లోనే ఇవి బెస్ట్ ఓపెనింగ్స్ అవుతాయని అంటున్నారు. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు, విమర్శకులు దర్శకుడి ప్రతిభ గురించి మాట్లాడుతూ సందీప్ వంగ మంచి స్టోరీ టెల్లర్ అని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాడని, నటీనటుల నుండి పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్న విధానం చాలా బాగుందని కితాబిస్తున్నారు. సో మన తెలుగు దర్శకుడు హిందీలో కూడా దమ్ము చూపాడని రూఢీ అయిపోయింది. ఇకపోతే సందీప్ వంగ తర్వాతి సినిమాను తెలుగులో చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More