బి టౌన్ లో నెక్స్ట్ బ్లాస్ట్..”యానిమల్” టీజర్ కి డేట్ ఫిక్స్.!

Published on Sep 18, 2023 11:00 am IST

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా మళ్ళీ సెన్సేషనల్ బౌన్స్ బ్యాక్ ఇచ్చిన తర్వాత అయితే మళ్ళీ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన మరో చిత్రం “జవాన్” సినిమా ఇప్పుడు రికార్డులు తిరగ రాస్తుండగా ఈ సినిమా తర్వాత అయితే బాలీవుడ్ సినిమా దగ్గర అంతకు మించి సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్న నెక్స్ట్ బిగ్ మూవీనే “యానిమల్”.

మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హీరో రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన సెన్సేషనల్ వైలెంట్ చిత్రమే ఈ “యానిమల్”. మరి ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ప్రీ టీజర్ చూసాక అంతా మెయిన్ టీజర్ కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూడగా ఇప్పుడు అయితే మేకర్స్ దీనిపై సాలిడ్ అప్డేట్ ని అందించారు.

ఈ అవైటెడ్ టీజర్ ని అయితే అనుకున్నట్టుగానే ఈ సెప్టెంబర్ 28న ఉదయం 10 గంటలకి రణబీర్ కపూర్ బర్త్ డే కానుకగా అయితే విడుదల చేస్తున్నట్టుగా రణబీర్ పై స్టైలిష్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. దీనితో పాన్ ఇండియా ఆడియెన్స్ మంచి ఎగ్జైటింగ్ గా దీని కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :