సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా వెలుగొందిన వారిలో త్రిష కూడా ఉంది. గత పది సంవత్సరాలుగా తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష బాలీవుడ్ పై తన అభిప్రాయాన్ని చెప్పింది.
‘బాలీవుడ్ అనేది నా కెరీర్లో భాగం కాదు. ఎందుకంటే నా దగ్గర అంత టైం లేదు, అలాగే వాళ్ళలా ప్రమోషన్స్ కి అన్ని రోజులు డేట్స్ ఇవ్వలేను. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు సినిమాలో నటించిన దానికంటే ఎక్కువగా ప్రమోషన్స్ కి డేట్స్ ఇస్తారని’ తెలిపింది. త్రిష బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన కట్టా మీటా సినిమాలో నటించింది.
త్రిష ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే తమిళంలో అజిత్ సరసన ఓ సినిమా, జయం రవి సరసన ఓ సినిమా చేస్తోంది.


