సౌత్ హీరోకి ఫ్యాన్ అంటున్న బాలీవుడ్ స్టార్ !

Ranbir Kapoor

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ బీర్‌ కపూర్‌ కి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ లో కొందరు హీరోలు కూడా ఆయనను అభిమానిస్తారు. అలాంటి రణ్‌ బీర్‌ కపూర్‌, ఓ సౌత్ హీరోకి ఫ్యాన్ అని చెప్పడం విశేషం. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌ బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ‘రామాయణ’ సినిమా చివర్లో రాముడు, రావణుడు ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడే సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే.. ఎప్పటినుంచో నేను యశ్‌ కు చాలా పెద్ద అభిమానిని’ అని రణ్‌ బీర్‌ కపూర్‌ తెలిపారు.

రణ్‌ బీర్‌ కపూర్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘యశ్, రావణుడి పాత్రలో ఒదిగిపోయిన తీరు చాలా బాగుంది. తనదైన స్వాగ్, ఆరా, నిజాయితీతో రావణుడి పాత్రకు ఆయన ప్రాణం పోశారు’ అని రణ్‌ బీర్‌ కపూర్‌ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘రామాయణం పార్ట్ 1’ ఈ ఏడాది దీపావళికి విడుదల కానుండగా.. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version