బాలీవుడ్ స్టార్స్ ఇలా దేశభక్తిని చాటుకున్నారు.

Published on Aug 14, 2019 9:00 pm IST

స్వాతంత్ర్య వేడుక సంధర్బముగా బాలీవుడ్ స్టార్స్ తమ దేశ భక్తిని చాటుకోనున్నారు. ఈ ఏడాది పుల్వామా ప్రాంతంలో టెర్రరిస్టుల దుశ్చర్య కారణంగా 40మంది సిఆర్పిఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశంకోసం ప్రాణాలు అర్పించిన ఆ వీర జవానుల త్యాగాన్ని స్మరించుకుంటూ “తు దేశ్ మేరీ” అనే పేరుతో చిత్రీకరించిన దేశభక్తి గీతంలో బాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారు. అమితాబ్,అక్షయ్ కుమార్, సల్మాన్, అమీర్, షారుక్,అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్, రణ్వీర్ కపూర్,టైగర్ ష్రాఫ్,ఐశ్వర్య రాయి,దీపికా పద కొనే, అలియా భట్ ఇలా మొత్తం 14మంది బాలీవుడ్ స్టార్స్ ఈ దేశభక్తి గీతంలో కనిపించనున్నారు. బాలీవుడ్ ప్రముఖ గాయకులు సోను నిగమ్, సుక్వీందర్ సింగ్ ఆలపించనున్నారు.

ఈఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా ప్రాంతంలో రహదారి మధ్యలో టెర్రరిస్టులు ఏర్పాటు చేసిన అతి శక్తివంతమైన మందుపాతర పేలుడు ఘటనలో, వాహనంలో ప్రయాణిస్తున్న 40మంది సి ఆర్ పి ఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోగా 35మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

సంబంధిత సమాచారం :