ప్రముఖ దివంగత నటి, అతిలోక సుందరి అయిన నటి శ్రీ దేవి మరణం భారత సినీ పరిశ్రమలో ఒక సంచలనం రేపింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీ దేవి భర్త అయిన బోణీ కపూర్ మరియు వారి ఇద్దరు కూతుర్లు. ఇదిలా ఉంటే ఇటివల చిత్ర సీమలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న విషయం ఏమిటంటే బోణీ కపూర్ తన భార్య శ్రీ దేవి జ్ఞాపకార్థంగా ఆమె జీవితంపై ఒక బయో పిక్ తీయాలనుకుంటున్నాడట.
ప్రస్తుతం ముంబాయి లోనే చిత్రసీమలో ఈ విషయంపై హాలానే జరుగుతున్నాయి. కానీ ఏది ఏమైనా బోణీ కపూర్ పాత్రం ఎట్టి పరిస్థితుల్లో శ్రీ దేవి బయో పిక్ తీసి తీరుతానని నిర్ణయం తీసుకున్నాడట.
అంటే కాకుండా ఈ చిత్రానికి సంబంధించి శ్రీ, శ్రీ దేవి, శ్రీ మామ్ అను మూడు పేర్లను కూడా నిర్ణయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు సమాచారం.
శ్రీ దేవి సంఘటన వలన ఆగిపోయిన బోణీ కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ సినిమాను కూడా మళ్ళీ మొదలు పెట్టి అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడట.


