అతిలోక సుంద‌రి లేకుండా మొదటి పుట్టినరోజు !

అతిలోక సుంద‌రి లేకుండా మొదటి పుట్టినరోజు !

Published on Nov 11, 2018 1:47 PM IST

అతిలోక సుంద‌రి శ్రీదేవి మరణం బోనీకపూర్ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో నెట్టేసింది. ఆ బాధలో నుండి వారు ఎట్టకేలకు నెమ్మదిగా కోలుకున్నారు. శ్రీదేవి లేకపోయిన బోనీకపూర్ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి. శ్రీదేవి మరణించిన తరువాత జరిగిన బోనీ మొదటి పుట్టినరోజు వేడుక కావడంతో.. కుటుంబ సభ్యులంతా ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరయ్యి బోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా తన తల్లి పట్ల శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ .. అమ్మ భౌతికంగా మనకి దూరమైనా మానసికంగా ఎప్పుడూ మనతోనే ఉంటారని, అమ్మ స్పర్శ ఎప్పుడూ నా చుట్టూనే ఉంటుందని ఆమె తెలిపారు. ఇక బోనికపూర్ ఈ పుట్టినరోజుతో 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు