ఇప్పుడు మన దగ్గర వస్తున్న పాన్ ఇండియన్ సినిమాల పై ఏ రేంజ్ లో రచ్చ నడుస్తోంది. బాహుబలి తో దక్షిణాది సినిమాను ఖండాంతరాలు దాటించేసిన ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు మరో భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే పాన్ ఇండియన్ సినిమాను తీస్తున్నారు. ఇద్దరు పవర్ ఫుల్ మాస్ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల కలయికలో అల్లూరి మరియు కొమరం భీమ్ ల పాత్రలుగా తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ చిత్రం నుంచి ఇప్పటికే మైండ్ బ్లోయింగ్ టీజర్ లు ఇద్దరి హీరోలపై వచ్చాయి.
కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది చాలదని ఇద్దరి హీరోల అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. విడివిడిగా కాదు ఇద్దరు హీరోలు కలిపి ఉన్న టీజర్ ను లేకపోతే పోస్టర్స్ వదలాలి అని కోరుకుంటున్నారు. అప్పుడు చూపిస్తాం అసలు మాస్ హిస్టీరియా అంటే ఏమిటో అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ రచ్చ చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం పక్కా ప్రణాళికతో ఏ సమయానికి ఏది వదలాలి అన్న క్లారిటీతోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఫ్యాన్స్ ఇంతలా డిమాండ్ చేస్తున్న అప్డేట్ ను వదులుతారా లేదా అన్నది చూడాలి.


