ఎన్టీఆర్ బయోపిక్ నాడే వైఎస్సార్ బయోపిక్ కూడ ?

Published on May 29, 2018 6:34 pm IST

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో బయోపిక్స్ హవా జోరందుకుంది. ప్రముఖ వ్యక్తుల జీవితాల్ని సినిమా రూపంలో తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలక్రిష్ణ తన తండ్రి, దివంగత నేత రామారావుగారి జీవితాన్ని సినిమాగా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 2019 సంక్రాంతి నాటికి దాన్ని విడుదలచేస్తామని కూడ ప్రకటించారు.

ఇక మరోవైపు దర్శకుడు మహి వి రాఘవ్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో చేస్తున్న ప్రముఖ దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ జూలైలో రెగ్యుల షూట్ కు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కూడ 2019 సంక్రాంతి నాటికి విడుదలచేసే యోచనలో సదరు దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇద్దరు ప్రముఖ వ్యక్తుల బయోపిక్స్ ఒకేసారి విడుదలకానుండటం విశేషమనే చెప్పాలి. అయితే ఈ వార్తపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :