‘మహర్షి’ సెట్ లో ‘boy’ ఫస్ట్ లుక్ !

Published on Apr 7, 2019 10:13 pm IST

“విశ్వరాజ్ క్రియేషన్స్” బ్యానర్ పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం “boy”. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అన్నపూర్ణ స్టుడియోస్ లో “మహర్షి ” సినిమా సెట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి లాంచ్ చేశారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ… ఈ సినిమా టైటిల్ ‘బోయ్’ నాకు బాగా నచ్చింది. బోయ్ స్టేజ్ లో ప్రతి ఒక్కరికి ఎన్నో మెమొరీస్ ఉంటాయి. హై స్కూల్ యూనిఫామ్ లో ఉన్న స్టూడెంట్, కాలేజ్ వైపు చూస్తూ ఉన్న ఈ పోస్టర్ వెనకున్న కాన్సెప్ట్ చూస్తుంటే, నాకు నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. అమర్ కి సినిమా అంటే ప్యాషన్. పోస్టర్ విషయం లోనే ఇంత శ్రద్ద తీసుకుంటే సినిమా ఇంకా బాగా తీసుంటారని అర్ధమవుతుంది. సమయం కుదుర్చుకుని ఈ సినిమా చూడాలనుంది అని అన్నారు. దర్శకుడు అమర్ కి మరియు “boy” చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు.

లక్ష్య, వినయ్ వర్మ, సాహితి. నీరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాని కి

కెమెరా: అష్కర్, ఎడిటింగ్: ఏకలవ్యన్, సంగీతం: ఎల్విన్ జేమ్స్.

సహ నిర్మాతలు: శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి. నిర్మాతలు: ఆర్. రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్

రచన, దర్శకత్వం: అమర్ విశ్వరాజ్.

సంబంధిత సమాచారం :