12 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “బోయపాటి రాపో ఫస్ట్ థండర్”

Published on May 18, 2023 10:48 pm IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మొదటిసారిగా ఒక యాక్షన్ డ్రామా కోసం చేతులు కలిపారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా బోయపాటి రాపో అని టైటిల్ పెట్టారు. నటుడి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ థండర్ పేరిట వీడియో ను విడుదల చేశారు. ఈ వీడియో కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 12 మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్ లో దూసుకు పోతుంది.

రామ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రామ్ ను ఈ రేంజ్ మాస్ లో బోయపాటి శ్రీను చూపించడం తో హైప్ మరింత పెరిగింది. శ్రీలీల, సాయి మంజ్రేకర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20, 2023న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కి సిద్ధం అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :