యాక్షన్ సన్నివేశాల కోసం భారీ గా ఖర్చు పెట్టిస్తున్న మాస్ డైరెక్టర్ !

యాక్షన్ సన్నివేశాల కోసం భారీ గా ఖర్చు పెట్టిస్తున్న మాస్ డైరెక్టర్ !

Published on Jun 17, 2018 12:54 AM IST

బోయపాటి శ్రీను సినిమా లు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది యాక్షన్ సన్నివేశాలు . అయన ఎక్కువగా వీటి మీదనే ద్రుష్టి పెడతారని మనకు తెలిసిందే . తాగాజా ఇప్పడు రామ్ చరణ్ తో తీస్తున్న సినిమాలో కూడా యాక్షన్ సన్నివేశాల కోసం భారీ గా ఖర్చు పెట్టిస్తున్నాడట ఈ దర్శకుడు. 60 మంది ఆర్టిస్టులు అలాగే 500 మంది బాడీ బిల్డర్లు పాల్గొననున్న యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 5 కోట్లు ఖర్చు పెడుతున్నారట చిత్ర నిర్మాత దానయ్య .

హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో దిట్ట అయినా బోయపాటి ఈ సినిమాలో చరణ్ ను ఏ రేంజ్ లో చూపెడతారోనని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు