కథ పై యాక్షన్ డైరెక్టర్ కసరత్తులు !

కథ పై యాక్షన్ డైరెక్టర్ కసరత్తులు !

Published on Jun 26, 2026 4:03 PM IST

నటసింహం బాలయ్యతో బోయపాటి శ్రీను తీసిన ‘అఖండ 2 – తాండవం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో తన తర్వాత సినిమా పై బోయపాటి కసరత్తులు చేస్తున్నాడు. అలాగే తన నుంచి రాబోయే తర్వాత చిత్రం పై కూడా ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో సూర్యతో బోయపాటి శ్రీను ఓ సినిమా చేస్తారనే టాక్ నడుస్తోంది.

ఇక కథ విషయానికి వస్తే బోయపాటి తన టీమ్ తో సూర్య కోసం కథను సిద్దం చేశారని.. కథలో చాలా వేరియేషన్స్ ఉంటాయని.. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో బోయపాటి – సూర్య కలయికలో వచ్చే సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

అన్నట్టు బోయపాటి శ్రీను మరొక స్టార్ హీరో కోసం కూడా కథ రెడీ చేశాడని.. మొత్తానికి బోయపాటి శ్రీను ఈ సారి పాన్ ఇండియా మూవీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. మరి బోయపాటి అంటేనే యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్. ఈ లెక్కన ఆయన చేసే ట్రైలింగ్వల్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు