సినిమా హిట్ లేదా ఫ్లాప్స్ తో సంబందం లేకుండా వరుసగా సినిమాలు తీస్తూ, ఎప్పుడూ వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేస్తుంటాడు. అలాగే కొంత మంది కనుమరుగైన లేదా చాలా కాలం తెరపై కనిపించని నటీనటుల్ని కూడా తన సినిమాల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చేలా చేస్తుంటాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మంచు విష్ణు హీరోగా చేసిన సినిమా ‘అనుక్షణం’ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.
తెలుగు తెరపై చాలా రోజులు కనిపించకుండా పోయిన సీనియర్ నటి రేవతి గుర్తుందా.? వర్మ అనుక్షణం సినిమాలో రేవతికి ఓ కీలక పాత్రని క్రియేట్ చేసాడు. అంతే కాకుండా ఆమెకి కామెడీ కింగ్ బ్రహ్మానందం కాంబినేషన్ ని సెట్ చేసాడు. అనుక్షణం లో బ్రహ్మానందం రేవతితో కలిసి ట్రావెల్ అయ్యే ఓ పాత్ర చేసాడు. ఆ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుందని ఈ చిత్ర టీం అంటోంది.
మొట్ట మొదటి సారిగా వేలం పాట(ఆక్షన్) ద్వారా రిలీజ్ చేస్తున్న ఈ మూవీకి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. ఒక సైకో కిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది.


