వీకెండ్ వెంకట్ గా పండగ చేయనున్న బ్రహ్మి

వీకెండ్ వెంకట్ గా పండగ చేయనున్న బ్రహ్మి

Published on May 7, 2015 3:31 PM IST

Brahmanandam
‘మసాలా’తో పరాజయాని అందుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ బాగా గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ‘పండగ చేస్కో’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవలే విడుదలైన సాంగ్స్ మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో బ్రహ్మానందం పై షూట్ చేసిన సీన్స్, ట్రైలర్ ఫైనల్ కట్ లో వచ్చే ట్రైన్ సీన్ ఆడియన్స్ ని విపరీతంగా నవ్విస్తోంది.

తాజాగా ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ ఈ సినిమా ఫైనల్ కట్ వెర్షన్ చూసి బ్రహ్మానందం పాత్ర గురించి రివీల్ చేసేసాడు. ‘నిన్ననే పండగ చేస్కో ఫైనల్ ఎడిట్ చూసాను. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. రామ్, రకుల్ ప్రీత్, సోనాల్ చౌహాన్, గోపీచంద్ మలినేని సూపర్బ్ అవుట్ పుట్ ఇచ్చారు. ఇక ఎప్పటిలాగే కామెడీ కింగ్ బ్రహ్మానందం వీకెండ్ వెంకట్ రావుగా ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు. డైలాగ్స్ అన్నీ బాగా హ్యూమర్స్ గా ఉంటాయి. నాకు రైటర్ గా 100% సంతృప్తిని, ఒక స్క్రీన్ ప్లే రైటర్ గా బాగా చాలెంజ్ గా అనిపించిన సినిమా పండగ చేస్కో’ అని కోన వెంకట్ చేసాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఎప్పటిలానే కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి వీకెండ్ వెంకట్ రావు గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి సినిమాని సేవ చేసేలా కనిపిస్తోంది.

రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు. మే చివర్లోగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు