‘గురుశ్రీ’ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ హాస్యనటుడు !

Brahmanandam

తెలుగు చిత్రసీమలో ఈ తరానికి హాస్యాన్ని పరిచయం చేసిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ‘గురుశ్రీ’ పురస్కారాన్ని అందుకోవడం హాస్య అభిమానులు అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. కాగా కృష్ణాష్టమిని సందర్భంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారు ఆదివారం చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించారు, ఆ కార్యక్రమంలో బ్రహ్మానందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

గురుశ్రీ పురస్కారాన్ని అందించిన అసోసియేషన్ ‘హాస్యబ్రహ్మ’కు స్వర్ణకంకణ ధారణ చేసింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం సరదాగా దేవుళ్ళు గురించిమాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞలు తెలిపారు. అయితే ప్రస్తుతం బ్రహ్మానందం చిత్రాల్లో కనిపించడం చాలా వరకు తగ్గింది. ఆ కారణంగానే ఆయన ఓ టీవీ షో కూడా చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల టాక్. ఏమైనా తన కామెడీ టైమింగ్ తో తెలుగు సినీ చరిత్రలో తనకంటూ బ్రహ్మానందం ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

Exit mobile version