స్వామిజీ అవతారంలో బ్రహ్మానందం..!

brahamanandham

‘అత్తారింటికి దారేది’ చిత్రంలో దొంగ స్వామిజీ చేతిలో మోసపోయిన బ్రహ్మానందం ఈసారి స్వామిజీ అవతారంలో కనిపించనున్నారు. సూర్య, సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంజాన్’. ఈ సినిమాలో బ్రాహ్మి స్వామిజీ వేషం వేస్తున్నారు. తాజాగా విడుదలైన ‘అంజాన్’ చిత్రంలో ఆ విషయం స్పష్టం అయ్యింది.

బ్రహ్మానందం స్వామిజీ వేషంలో నవ్వులు పూయించడం కొత్తేమీ కాదు. గతంలో ఇంద్ర, గుడుంబా శంకర్, బద్రీనాథ్ చిత్రాలలో దొంగ స్వామిజీ అవతారంలో కితకితలు పెట్టారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ‘అంజాన్’ చిత్రంలో మరింతగా రెచ్చిపోతారని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version