
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే ‘శ్రీమంతుడు’ సినిమాతో ఓ బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో ఫుల్ జోష్ మీదున్న మహేష్ బాబు సెప్టెంబర్ 16న తన తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ ని మొదలు పెట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు అండ్ టీం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ స్పెషల్ సెట్లో బ్రహ్మోత్సవం షూటింగ్ చేస్తున్నారు. ఇక నుంచి కంటిన్యూగా షూటింగ్ జరగనుంది. ముందుగా ఈ సినిమాని జూలైలోనే స్టార్ట్ చేసి 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ మొదలవ్వడం రెండున్నర నెలలు ఆలస్యం కావడం వలన 2016 సమ్మర్లో రిలీజ్ అవుతుందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలిపింది.
తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం బ్రహ్మోత్సవం సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. 2016లో వచ్చే ఫస్ట్ సమ్మర్ రిలీజ్ మూవీగా ఏప్రిల్ 7న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. ఇప్పటికే మహేష్ బాబు ఫిబ్రవరి చివరి కల్లా షూటింగ్ పూర్తి చేయాలని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకి సూచించినట్లు సమాచారం. మార్చి చివరికల్లా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఫినిష్ చేసి ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి అన్ని ప్లాన్స్ ని పర్ఫెక్ట్ గా రెడీ చేస్తున్నారు. మహేష్ బాబు సరసన స్టార్ హీరోయిన్స్ అయిన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణితలు నటిస్తున్నారు. వీరితో పాటు యంగ్ హీరోయిన్ అయిన చాందిని చౌదరి కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.
శ్రీ కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని పివిపి బ్యానర్ పై అంత్యంత భారీ బడ్జెట్ మరియు గ్రాండ్ సెట్టింగ్స్ తో నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.