నేడే ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ ప్రారంభం!

Bramothsam
‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్స్‌బస్టర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన కుటుంబ చిత్రాన్నిచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్‍తో ‘బ్రహ్మోత్సవం’ కోసం మరోసారి జతకట్టారు. పీవీపీ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇక గత కొద్దిరోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

రామోజీ ఫిల్మ్‌సిటీలో నేడు మొదలయ్యే షూటింగ్ పదిరోజుల పాటు సాగనుంది. మొదటి 5 రోజులు ఓ ఫ్యామిలీ సాంగ్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మహేష్‌తో పాటు ఈ షెడ్యూల్‌లో మిగిలిన ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నారు. సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఇక ఈ సినిమా మహేష్ కెరీర్లో మరో గుర్తుండిపోయే ఒక సినిమాలా నిలబడుతుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించిన టీమ్, అన్నీ సరిగ్గా కుదిరాయి అనుకున్నాకే సెట్స్‌పైకి వెళుతోంది.

Exit mobile version