
సూపర్ స్టార్ మహేష్ బాహు తన ఫ్యామిలీతో పారిస్ హాలిడే ట్రిప్ ని ఫినిష్ చేసుకొని ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నాడు. హాలిడే సీజన్ పూర్తవడంతో మహేష్ బాబు తన ఫుల్ ఫోకస్ ని తన నెక్స్ట్ మూవీ బ్రహ్మోత్సవం పైకి షిఫ్ట్ చేసాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ‘బ్రహ్మోత్సవం’ టీం రీసెంట్ గా మూడవ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టింది. గత రెండు రోజులుగా మహేష్ బాబు ఇతర తారాగణంపై కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు తాజాగా ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషిస్తున్న సత్యరాజ్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
ప్రస్తుతం మహేష్ బాబు – సత్యరాజ్ ఇన్వాల్వ్ అయిన సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ముందుగా నవంబర్ లో ఈ చిత్ర టీం ఊటీ షెడ్యూల్ కి డేట్ ని ఫిక్స్ చేసింది. కానీ హైదరాబాద్ లోనే మూడవ షెడ్యూల్ ని మొదలు పెట్టేయడంతో ఊటీ షెడ్యూల్ ని కాస్త వెనక్కి జరిపి డిసెంబర్ 8కి వేసారు. డిసెంబర్ మొదటి వారం వరకూ హైదరాబాద్ లో షూటింగ్ జరిపి ఆ తర్వాత ఈ చిత్ర టీం ఊటీకి వెళ్లనుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్, ప్రణితలు మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్నారు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూట్ చేసి సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.

