సమీక్ష : “భ్రమయుగం” – అక్కడక్కడ మెప్పించే పీరియాడిక్ హారర్ డ్రామా!

సమీక్ష : “భ్రమయుగం” – అక్కడక్కడ మెప్పించే పీరియాడిక్ హారర్ డ్రామా!

Published on Feb 24, 2024 3:05 AM IST
Bramayugam Movie Review in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు

దర్శకుడు: రాహుల్ సదాశివన్

నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్. శశికాంత్

సంగీత దర్శకులు: క్రిస్టో జేవియర్

సినిమాటోగ్రాఫర్: షెహనాద్ జలాల్

ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ

సంబంధిత లింక్స్: ట్రైలర్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ యాక్షన్ డ్రామా భ్రమయుగం. అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ ఇతర కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

తేవన్ (అర్జున్ అశోకన్) ఒక మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ.. అనుకోకుండా చివరకు ఒంటరిగా ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ ఓ వంటవాడు (సిద్ధార్థ్ భరతన్) తో పాటు ఆ ఇంటి యజమాని కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి) మాత్రమే ఉంటారు. తన ఇంటికి వచ్చిన అతిథి అంటూ తేవన్‌ ను కుడుమోన్ పొట్టి బాగానే ఆదరిస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించవు. అసలు తేవన్ ఎందుకు పారిపోవాలి అనుకున్నాడు?, ఇంతకీ కుడుమోన్ పొట్టి ఎవరు ?, అతని నేపథ్యం ఏమిటి ?, అసలు అడవిలో పాడుబడ్డ భవంతిలో కుడుమోన్ పొట్టి ఏం చేస్తున్నాడు?, చివరకు తేవన్ (అర్జున్ అశోకన్) ఆ భవంతి నుంచి తప్పించుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మమ్ముట్టి పాత్ర, ఆయన నటనే. నెగిటివ్ షేడ్స్ లో సాగే పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. కొన్ని థ్రిల్లర్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆయన చాలా బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా మమ్ముట్టి నటన చాలా బాగుంది. ఇక దర్శకుడు రాహుల్ సదాశివన్ రాసుకున్న మెయిన్ కథాంశం, అలాగే కథ జరిగిన నేపథ్యం బాగున్నాయి.

ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ అశోకన్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని హారర్ సన్నివేశాల్లో అర్జున్ అశోకన్ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. మరో కీలక పాత్రలో నటించిన సిద్ధార్థ్ భరతన్ కూడా బాగా నటించాడు. అలాగే అమల్దా లిజ్ కూడా తన గ్లామరస్ లుక్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దర్శకుడు రాహుల్ సదాశివన్ కథలో ఉన్న సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేసాడు. పైగా హారర్ సీన్స్ ను కూడా చాలా బాగా పిక్చరైజ్ చేసాడు.

మైనస్ పాయింట్స్ :

కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సాగిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది డౌటే. చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. దీనికితోడు ఈ భ్రమ యుగం స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా సాగింది.

సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది ?, అర్జున్ అశోకన్ పాత్ర ఆ భవంతి నుంచి ఎలా తప్పించకుంటుంది ? అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో బాగానే కలిగించినా.. అదే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే సీక్వెన్స్ లను కూడా ఇంకా బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు రాహుల్ సదాశివన్, కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సీన్స్ ను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. కానీ, ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు క్రిస్టో జేవియర్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలను అభినందించాలి. నిర్మాతలు చక్రవర్తి, రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘భ్రమయుగం’ అంటూ వచ్చిన ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఓ వర్గం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు రాహుల్ సదాశివన్ రాసిన కథ, హారర్ సన్నివేశాలు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే టేకింగ్ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చినా.. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం నచ్చకపోవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు