హాస్య బ్రహ్మ బ్రహ్మనందం కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా ఆయన ఆంధ్రదేశాన్ని తన నవ్వులతో ముంచెత్తుతున్నారు. ఒకప్పుడు బ్రహ్మనందం లేని సినిమా అనేది ఉండేది కాదు. ఐతే కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా ఆయన సినిమాలు విరివిగా చేయడం లేదు. లేటెస్ట్ గా విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంలో బ్రహ్మానందం నటించడం జరిగింది. దీనితో దర్శకుడు హరీష్ ఆయనతో హిల్లేరియస్ కామెడీ పండిస్తారని అనుకున్నారంతా.కానీ అందుకు భిన్నంగా ఓ పాత్ర చేయించారు దర్శకుడు.
మూవీ ప్రారంభంలో,చివర్లో వచ్చి వెళ్లే ….,”సినిమా ఓ ఆకాశం…,సినిమా ఓ అవకాశం..,సినిమా ఓ ఆనందం..,సినిమా ఓ తలపు..,సినిమా ఓ గెలుపు…” అని సాగే డైలాగ్ లో సినిమా ఔన్నత్యాన్ని తెలిపే పాత్రకే పరిమితం చేశాడు. ఐతే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో బ్రహ్మనందం తో అల్టిమేట్ కామెడీ చేయించిన హరీష్ ఈ మూవీలో బ్రహ్మనందం పాత్ర అలా ముగించారు.
