టీజర్ తో అంచనాలు పెంచేసిన ‘బ్రాండ్ బాబు’ !

టీజర్ తో అంచనాలు పెంచేసిన ‘బ్రాండ్ బాబు’ !

Published on Jul 9, 2018 5:20 PM IST

band3

నెక్స్ట్ నువ్వే చిత్రంతో తొలిసారి మెగా ఫోన్ పట్టిన ఈటివి ప్రభాకర్, ఆ చిత్రం పెద్దగా విజయం సాధించకపోవడంతో తదుపరి చిత్రం తప్పక విజయవంతం సాధించాలని ‘బ్రాండ్ బాబు’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శైలేంద్ర బాబు నిర్మించారు. కాగా ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. కొద్దీ సేపటి క్రితం ఈ చిత్ర టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఇక టీజర్ చూస్తుంటే హీరో సుమంత్ శైలేంద్ర తన నటన తో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. అలాగే హీరోయిన్ గా నటించిన ఇషా రెబ్బ కూడా మంచి పెర్ఫార్మన్స్ రోల్ చేస్తున్నట్లుంది. తన కొడుకు అన్ని విషయాల్లోనూ బ్రాండ్ ని మాత్రం మిస్ అవ్వడాన్ని హీరో గురించి తండ్రి మురళి శర్మ చెప్పిన బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బాగుంది. మొత్తంగా చూస్తే ఈ చిత్ర టీజర్ బాగానే ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

 

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

తాజా వార్తలు