పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ బ్రో. జులై 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రం. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. చిత్రం నుండి రిలీజైన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.
అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నైజాం ప్రాంతంలో బ్రో యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ పై ఇక్కడ అప్డేట్ ఉంది. సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ అధికారిక ధృవీకరణ ప్రకారం, నైజాంలోని థియేటర్లలో బ్రో అడ్వాన్స్ బుకింగ్‌లు రేపు ప్రారంభం కానున్నాయి. పాజిటివ్ బజ్ ఉన్నందున, ఈ చిత్రం ఫస్ట్ర వీకెండ్ మంచి వసూళ్లను రాబట్టనుంది.
ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.


