పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “బ్రో ది అవతార్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండగా గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం నుంచి ఇపుడు క్రేజీ అప్డేట్ అప్డేట్ అయితే వచ్చేసింది.
పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ లపై అదిరే పోస్టర్ ని తమ వింటేజ్ పోశ్చర్స్ తో అయితే డిజైన్ చేసి రిలీజ్ చేశారు. మరి ఇందులో పవన్ సాయి ధరమ్ తేజ్ అదరగొట్టగా ఇక ఈ అవైటెడ్ టీజర్ అయితే రేపు జూన్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అది కూడా సినిమా థియేటర్స్ లో ఈ అవైటెడ్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి సినిమాపై కావాల్సిన హైప్ ని ఎక్కిస్తున్న మేకర్స్ రేపు టీజర్ తో ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.
