నందమూరి బాలకృష్ణ మరియు యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఒకటి కాకుండా రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథ చాలా పెద్దదిగా ఉండటం, ఒకే భాగంలో ఆ కథను పూర్తిగా వివరించలేకపోవడంతో ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా తీసుకురావాలని చూస్తున్నారట. దీనికి బాలయ్యతో పాటు నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. ఇక ఈ చిత్రానికి ‘కురుక్షేత్రం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, ఈ ఏడాది దసరా తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
అయితే బాలకృష్ణ ఈ రెండు భాగాల షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేయనున్నాడట. వివేక్ ఆత్రేయ షెడ్యూల్స్‌ను పక్కాగా సిద్ధం చేస్తుండగా, బాలయ్య కూడా ఎటువంటి జాప్యం లేకుండా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర బృందానికి సూచించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. మరి బాలయ్య కోసం వివేక్ ఆత్రేయ ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడో చూడాలి.
