
‘బ్రూస్‌లీ’.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతోన్న సినిమా. బాహుబలి, శ్రీమంతుడు లాంటి రెండు బ్లాక్‌బస్టర్స్ తర్వాత తెలుగులో ఆ స్థాయి సినిమాగా ప్రచారం పొందుతూ వస్తోన్న సినిమా కావడంతో బ్రూస్‌లీపై అంతటా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై మంచి ఆసక్తి కలిగిస్తుండగా, శ్రీనువైట్ల పుట్టినరోజున మరో సాంగ్ టీజర్‌తో బ్రూస్‌లీ టీమ్ అలరించేందుకు సిద్ధమవుతోంది.
సెప్టెంబర్ 24 శ్రీనువైట్ల పుట్టినరోజున బ్రూస్‌లీ సినిమాలోని ఓ పాటకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ మధ్యే విడుదలైన ఒక సాంగ్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మరింత ఉత్సాహంతో కొత్త సాంగ్ టీజర్‌ను బ్రూస్‌లీ టీమ్ రిలీజ్‌కు సిద్ధం చేస్తోంది. ఇక అక్టోబర్ 2న భారీ ఎత్తున ఆడియో రిలీజ్ జరుపుకోనున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల కానుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో చిరంజీవి ఓ గెస్ట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే!

