‘పెద్ది’ రన్ టైం పై షాకింగ్ బజ్!

‘పెద్ది’ రన్ టైం పై షాకింగ్ బజ్!

Published on May 8, 2026 7:57 PM IST

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ థింగ్ చిత్రమే “పెద్ది”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం భారీ ఎత్తున విడుదలకి రాబోతుంది. అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ బుకింగ్స్ ఆల్రెడీ రికార్డులు సంచలనం నమోదు చేస్తుండగా ఈ సినిమా తాలూకా రన్ టైం పై షాకింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

దీని ప్రకారం పెద్ది సినిమాకి కూడా ఈ మధ్య కాలంలో వస్తున్న పలు భారీ చిత్రాలు తరహాలోనే ఏకంగా 3 గంటలకి పైగా రన్ టైం ఈ సినిమాకీ వచ్చినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ కట్ లో కూడా అంతే ఉంటుందా లేక మూడు గంటలకి పైగానే వస్తుందా అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జూన్ 4న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు