బాలయ్య కోసం ‘స్పెషల్’ బ్యూటీ.. ఆమె ఫిక్స్..?

బాలయ్య కోసం ‘స్పెషల్’ బ్యూటీ.. ఆమె ఫిక్స్..?

Published on May 8, 2026 9:00 PM IST

Nandamuri-Balakrishna

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK111 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా నయనతారను అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. త్వరలోనే కాజల్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానుంది.

ఈ మాస్ ఎంటర్టైనర్‌లో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీని మేకర్స్ సెలెక్ట్ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక అంగీకారం కూడా లభించడంతో, త్వరలోనే ఈ భారీ సాంగ్ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ పాట సినిమాలో ఒక మేజర్ హైలైట్‌గా నిలవనుందని సమాచారం.

వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం తొలుత దసరాకు విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు