తెలుగు దర్శకుడి సినిమాకు నిర్మాతగా బ్రూస్ లీ స్నేహితుడు !

తెలుగు దర్శకుడి సినిమాకు నిర్మాతగా బ్రూస్ లీ స్నేహితుడు !

Published on Jun 19, 2018 12:10 PM IST

తెలుగులో ‘దేవి శ్రీ ప్రసాద్’ అనే సినిమాను రూపొందించిన దర్శకుడు శ్రీకిషోర్ ప్రస్తుతం ‘మై ఇండియన్ బాయ్‌ఫ్రెండ్‌’ అనే పేరుతో ఓక్ చైనీస్ సినిమాను తీయబోతున్న విషయం తెలిసిందే. ఏ చిత్రం పూర్తిస్థాయి ప్రేమ కథగా ఉండనుంది. ఇందులో మరొక విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ కింగ్, నటుడు, దర్శకుడు అయిన బ్రూస్ లీ స్నేహితుడు రాబర్ట్ ఛూ వహ్ ఫెంగ్ నిర్మించనున్నాడు.

ఈయన ప్రముఖ శాటిలైట్ ఛానెల్ చైనా ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కు వ్యవస్థాపకుడు కూడ. ఇలాంటి గొప్ప వ్యక్తి, బ్రూస్ లీ ఆప్త స్నేహితుడు తన సినిమాను నిర్మించనుండటం, బ్రూస్ లీ జ్ఞాపకాలను తనతో పంచుకోవడం చాలా బాగుందని శ్రీకిషోర్ మీడియాకు తెలిపారు, ఈ చిత్రం ఆగష్టు లో మొదలుకానుంది. ఈ సినిమాలో నటించబోయే నటీ నటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు