పవర్ ఫుల్ బీటిఎస్ స్టిల్ ను రిలీజ్ చేసిన “కల్కి” టీమ్!

పవర్ ఫుల్ బీటిఎస్ స్టిల్ ను రిలీజ్ చేసిన “కల్కి” టీమ్!

Published on Jul 11, 2024 4:01 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. ధియేటర్లలో వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని బాగా అలరిస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రంకు సంబందించిన ఒక బీటిఎస్ స్టిల్ ను మేకర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడం జరిగింది.

ఈ ఫొటోలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశం కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉంది. ప్రభాస్ తో పాటుగా, నాగ్ అశ్విన్ కూడా సీన్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పవర్ ఫుల్ ఫోటో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ లో దీపికా పదుకునే, దిశా పటాని, స్టార్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు