లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రమే “పెద్ది”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యిన తర్వాత పాజిటివ్ టాక్ ఎక్కువ వచ్చింది.
కానీ కొన్ని సీన్స్ విషయంలో మాత్రం ఆడియెన్స్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయ్యింది. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ విషయంలో అలానే మరికొన్ని సన్నివేశాలు బాగా అభ్యంతరకరంగా ఉన్నాయనే సెగ ఎక్కువ అయ్యిన సమయంలో దర్శకుడు బుచ్చిబాబు సానా అందుకు క్షమాపణ కోరడం జరిగింది.
ఒక ఫిల్మ్ మేకర్ గా తన సినిమాతో అందరినీ రంజింపజేయాలనేది తన ఉద్దేశం కానీ ఎవరినీ కించపరచడం ఇష్టం లేదని ఈ ప్రాసెస్ లో వచ్చిన ఫీడ్ బ్యాక్ ని తప్పకుండ తాను తీసుకొని జాగ్రత్తలు మున్ముందు వహిస్తానని సోషల్ మీడియాలో బుచ్చిబాబు ప్రామిస్ చేశారు. అలాగే పెద్ది సినిమాలో ఆ సన్నివేశాలు అన్నీ తొలగించి మళ్ళీ ప్రింట్ ని రీఎడిట్ చేసి అప్డేట్ చేస్తామని కూడా తెలిపారు. సో పెద్ది విషయంలో బుచ్చిబాబు కొత్త స్టేట్మెంట్ ఇపుడు వైరల్ గా మారింది.
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.
I have always had immense respect for…
— BuchiBabuSana (@BuchiBabuSana) June 6, 2026


