అల్లు శిరీష్ “బడ్డీ” ట్రైలర్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్!

అల్లు శిరీష్ “బడ్డీ” ట్రైలర్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్!

Published on Jun 24, 2024 10:38 PM IST

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో చిత్రం తరువాత బడ్డీ అనే ఒక్క సినిమానే ప్రకటించాడు. ఈ చిత్రం ఆర్య ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం టెడ్డీకి అధికారిక రీమేక్‌గా తెరకెక్కుతోంది. శాన్ అంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ రిలీజ్ పై ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. తాజాగా హీరో అల్లు శిరీష్ ట్రైలర్ రిలీజ్ టైమ్ ను ప్రకటించారు.

మంగళవారం రోజున సాయంత్రం 4:00 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన బడ్డీ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, మహమ్మద్ అలీ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. హిప్‌హాప్ తమిజా ఈ చిత్రం కి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు