ఎన్టీఆర్ బయోపిక్ కు బంఫర్ ఆఫర్ !

ఎన్టీఆర్ బయోపిక్ కు బంఫర్ ఆఫర్ !

Published on Aug 1, 2018 4:31 PM IST

ntr biopic11

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైద్రాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి సంభందించిన ఒక వార్త ఫిలిం సర్కిల్ లో వైరల్ అవుతుంది.

అదేంటంటే ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో విడుదలచేయనున్నారు. ఈమూడు భాషలకు సంభందించిన విడుదల హక్కుల కోసం ప్రముఖ సంస్థలు రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ అలాగే సోనీ పిక్చర్స్ సంయుక్తంగా రూ. 80 కోట్ల భారీ ధరను ఆఫర్ చేశాయట. ఇది నిజంగా బంఫర్ ఆఫర్ అనే చెప్పాలి. మరి ఇందుకు చిత్ర నిర్మాతలు అంగీకరిస్తారో లేదో చూడాలి. కైకాల సత్యనారాయణ , ప్రకాష్ రాజ్, మోహన్ బాబు , విద్యాబాలన్, మొదలైన ప్రముఖ తారాగణం నటిస్తున్నఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

తాజా వార్తలు