మరోసారి తండ్రి అవుతున్నానని ప్రకటించిన బన్నీ!
Published on Jul 20, 2016 6:56 pm IST

allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇటు కెరీర్ పరంగా, అటు వ్యక్తిగత జీవిత పరంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఈమధ్యే కెరీర్ పరంగా ‘సరైనోడు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బన్నీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ సంతోషకర వార్తను కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. తమ కుటుంబంలోకి త్వరలోనే ఓ కొత్త వ్యక్తి రాబోతున్నారని తెలుపుతూ బన్నీ, గర్భిణీ అయిన తన భార్య స్నేహతో కలిసి దిగిన ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇప్పటికే అల్లు అర్జున్‌ దంపతులు రెండేళ్ళ క్రితం తమ కుమారుడు అల్లు అయాన్‍కు జన్మనివ్వడంతో తల్లిదండ్రులు కాగా, ఇప్పుడు ఆ మధురానుభూతిని మరోసారి పొందనున్నారు. ఇక రెండో సారి తండ్రి అవుతున్న సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకునేందుకు బన్నీ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో అల్లు అయాన్ కూడా ఉండడం, తల్లి గర్భాన్ని అతడు ముద్దాడుతూ ఉండడం అందర్నీ బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్‌లో ఒకటిగా దూసుకుపోతోంది.

 
Like us on Facebook