అసలు.. ఈ హీరోయిన్ లో తల్లిని చూస్తారా ?

Published on Apr 14, 2019 9:47 pm IST

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పూజ కార్యక్రమంతో ఘనంగా మొదలైన విషయం తెలిసిందే. ఇక ఒకప్పటి టాప్ హీరోయిన్స్ ను తన సినిమాల్లో తల్లి లేదా అత్త క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు త్రివిక్రమ్. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబును చూపించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హల్ చల్ చేస్తోంది.

అసలు ఇంతకీ టబు అంటేనే ఇప్పటికీ కుర్రకారులో హీరోయిన్ రూపమే ప్రత్యక్షమవుతుంది. మరి అలాంటి హీరోయిన్ని తమ అభిమాన కథానాయకుడికి తల్లిగా చూస్తారా.. ? త్రివిక్రమ్ కాబట్టి రెండు బలమైన్ సీన్స్ తో నాలుగు లోతైన డైలాగ్ లతో తల్లిగా ఒప్పించేస్తాడు.

అయినప్పటికీ టబును ఇంకా హీరోయిన్ గానే చూడాలనుకుంటున్న ప్రేక్షకులకు మాత్రం ఇ ది కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :