బన్నీ – త్రివిక్రమ్ ‘వైకుంఠపురంలో’ ?

Published on Aug 13, 2019 3:40 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల్లు అర్జున్’ 19వ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా టైటిల్ ను ఆగష్టు 15న రివీల్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ‘నాన్న నేను’ మరియు ‘అలకనంద’ అనే టైటిల్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేశాయి. తాజాగా మరో టైటిల్‌ తెర మీదక వచ్చింది. ‘అల్లు అర్జున్’ 19వ సినిమాకు ‘వైకుంఠపురంలో’ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం ఆగష్టు 15న ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేసేదాకా ఆగాల్సిందే.

ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2020 లో విడుదల అవుతుంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ కామెడీ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశాడట

సంబంధిత సమాచారం :