బన్నీకి ఆ మూవీ మాములుగా నచ్చలేదట

Published on Aug 19, 2019 10:42 am IST

స్టైలిష్ స్టార్ బన్నీ కొద్దిసేపటి క్రితం గత రాత్రి చూసిన ఓ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ వేయడం జరిగింది. బన్నీని అంతగా ఆకట్టుకున్న ఆ చిత్రం ఏమిటంటే తాజాగా విడుదలైన ఎవరు. అడివి శేషు, రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

కాగా బన్నీ “ఎవరు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు. ఎవరు మూవీని గత రాత్రి చూశాను. ఊహించని మలుపులు, ట్విస్టులలతో సాగిన అద్భుత మర్డర్ మిస్టరీ ఎవరు చిత్రం. అడివి శేషు వరుసగా మంచి చిత్రాలను చేస్తున్నాడు. అడివిశేషు తో పాటు, రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర, మురళి శర్మ చిత్రంలో బాగా చేశారు. నిర్మాతలు పివిపి గారికి, అలాగే కెప్టెన్ వెంకట్ రాంజీ కి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేయడం చేశారు.

బన్నీ లాంటి స్టార్ హీరో ఎవరు చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం ఆ మూవీకి చాలా వరకు కలిసొచ్చే అంశం అనడంలో సందేహం లేదు. కాగా బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బన్నీ సరసన పూజా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :