‘సన్నాఫ్ సత్యమూర్తి’గా అల్లు అర్జున్..?

‘సన్నాఫ్ సత్యమూర్తి’గా అల్లు అర్జున్..?

Published on Jan 23, 2015 3:00 PM IST

Trivikram-alluarjun

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా టైటిల్ వేట పూర్తయిందని సమాచారం. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో త్వరగా టైటిల్ పై ఓ నిర్ణయం తీసుకోవాలని యూనిట్ తొందర పడుతుంది. తాజాగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అనే పేరు ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో ‘త్రిశూలం’, ‘హుషారు’, ‘జాదూగర్’ వంటి టైటిల్స్ వినిపించాయి. దర్శకుడు ఎ టైటిల్ వైపు మొగ్గు చూపుతారో..?

అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్న ఈ సినిమాలో సమంత, నిత్య మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు