‘S/O సత్యమూర్తి’ లాంటి ఓ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వార స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘సరైనోడు(వర్కింగ్ టైటిల్)’. కమర్షియల్ సినిమాలు కేరాఫ్ మారిన దర్శకులలో ఒకడైన బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకుడు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నిన్నటితో హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్ళారు.
రేపటి నుంచి ఈ చిత్ర టీం రాజమండ్రిలో ఓ మేజర్ షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారు. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్స్ అయిన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రేసలు కూడా పాల్గొననున్నారు. దాదాపు ఇప్పటికే 50% టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, ఆదర్శ్ బాలకృష్ణలు నెగటివ్ రోల్స్ లో కనిపించనున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తాడు.
