ట్రాఫిక్ పోలీసుల బాధలు చూడలేక బన్నీ ఇలా చేశాడా…!

Published on May 23, 2019 8:35 am IST

స్టైలిష్ స్టార్ బన్నీ చేసిన ఓ మంచి పని ఇప్ప్డుడు అతనిపై ప్రశంసలు కురిపిస్తుంది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయక హైదరాబాద్ ప్రధాన కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు స్వచ్ఛమైన, నాణ్యతతో కూడిన మజ్జిగ బాటిల్స్ ని ఉచితంగా అందిస్తున్నారు. పగటి వేళ ముఖ్యంగా మధ్యాహ్నం వేళలలో నడిరోడ్డులో నిలబడి విధులు నిర్వహించే పోలీసులు తరచుగా డీహైడ్రేషన్ కి లోనవుతూ వుంటారు. ఎండలలో వారు పడుతున్న అవస్థలను గమనించిన బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నారంట.

హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లయినా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ ఆర్ నగర్, పంజాగుట్ట వంటి పలు ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ మజ్జిగ బాటిల్స్ అందిస్తున్నారట. ఏమైనా బన్నీ చేస్తున్న ఈ పని మెచ్చుకోకుండా ఉండలేం కదా…!

సంబంధిత సమాచారం :

More