బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బన్నీ ?

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బన్నీ ?

Published on Jul 17, 2018 7:16 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’ చిత్రం హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ యూట్యూబ్‌లో రెండు కోట్లమందికి చేరువై సంచలనాత్మకమైన రికార్డలను సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిల్చింది.

అల్లు అర్జున్ సినిమాలకి హిందీలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఆ ఫాలోయింగ్‌ ను దృష్టిలో పెట్టుకొని బన్నీ ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేగాక హిందీలోని ఓ క్రేజీ డైరెక్టర్ తో కూడా బన్నీ సంప్రదింపులు జరుపుతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతోఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు