పరుగుతో బోయపాటి మూవీ మొదలెట్టిన బన్ని

పరుగుతో బోయపాటి మూవీ మొదలెట్టిన బన్ని

Published on Jul 29, 2015 10:56 AM IST

allu-arjun
‘S/O సత్యమూర్తి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో ఈ సారి తెలుగు ప్రేక్షుకుల ముందుకు రానున్నాడు. ఈ కమర్షియల్ మూవీకి బోయపాటి శ్రీను డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభమైంది. అల్లు అర్జున్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. మొదటి రోజు అల్లు అర్జున్ పై ఓ చేజింగ్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ చేసిన విషయాన్ని అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

‘బోయపాటి గారి సినిమా షూట్ ఈ రోజు ప్రారంభించాం. మొదటి రోజు షూటింగ్.. పరిగెత్తడానికి సిద్దమవుతున్నానని’ అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రేస హీరోయిన్స్ గా కనిపించనున్నారు. బోయపాటి శ్రీను అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఓ మాస్ కథని సిద్దం చేసాడు. గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ ఈ సినిమా కోసం స్పెషల్ పిజికల్ లుక్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు