మాస్ బన్నీ అతని కోసం క్లాస్ గా నటిస్తాడట..!

Published on Dec 18, 2019 8:45 am IST

అల వైకుంఠపురంలో మూవీ టీజర్ విడుదలైనప్పటి నుండి ఈ మూవీ కథపై అనేక అనుమానాలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. ఐతే బన్నీ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా అలాగే మాస్ విలేజ్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. అసలు రెండు గెటప్స్ లో కనిపిస్తున్న బన్నీ రోల్ పై ఇండస్ట్రీలో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఐతే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రంలో అమాయకుడు, సాఫ్ట్ పర్సనాలిటీ అయిన సుశాంత్ కి హెల్ప్ చేయడానికి వస్తాడని సమాచారం. సుశాంత్ పై జరుగుతున్న కుట్రను, ప్రత్యర్థుల ఆట కట్టించడానికి బన్నీ సుశాంత్ కి అండగా రంగంలోకి దిగుతాడట. మాస్ బ్యాగ్ గ్రౌండ్ ఉన్న మధ్య తరగతి కుటుంబానికి చెందిన బన్నీ..సుశాంత్ కొరకు క్లాస్ గా నటిస్తాడట.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :