జస్ట్ ప్రీ టీజర్ కే సాలిడ్ రెస్పాన్స్ కొల్లగొట్టిన బన్నీ.!

Published on Apr 4, 2021 2:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో కూడా తెలిసిందే. మరి ఇదిలా ఉండగా వచ్చే 8న బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ప్లాన్ చేసిన టీజర్ కు గాను రిలేటెడ్ గా ఓ ప్రీ టీజర్ క్లిప్ ను రిలీజ్ చేశారు.

కనీసం అల్లు అర్జున్ ముఖం కూడా చూపించని ఈ క్లిప్ సాలిడ్ రెస్పాన్స్ ను అందుకుంది.ఇప్పటి వరకు ఏ ప్రీ టీజర్ కు 24 గంటల్లో యూట్యూబ్ నుంచి రాని మిలియన్స్ కొద్దీ వ్యూస్ మరియు లైక్స్ ఈ ప్రీ టీజర్ కు వచ్చాయి. మొత్తం మూడు యూట్యూబ్ ఛానెల్స్ లో విడుదల చేసిన ఈ ప్రీ టీజర్ కు 4 లక్షలకు పైగా మరియు 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది.

మామూలుగానే బన్నీ వీడియోస్ కి యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ వస్తుంది. దీనితో చాలా కాలం అనంతరం వచ్చిన వీడియో కావడంతో దీనికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక దీనికే ఇలా ఉంటే ఈ 7న రానున్న టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఆగష్టు 13న భారీ స్థాయిలో రిలీజ్ చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :